కేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిండు.. అయినా ఆరు గ్యారంటీలు అమలు

కేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిండు.. అయినా ఆరు గ్యారంటీలు అమలు

కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయల  ప్రజాధనాన్ని  కాళేశ్వరం ద్వారా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.  కేసీఆర్ ఒంటేద్దు పోకడల వాళ్ళ  రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు వివేక్ . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామసభల్లో గత ప్రభుత్వ తప్పిదాలు కనబడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.  అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.  ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు వివేక్.