రైతులు ఆందోళన చెందవద్దు.. పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే వివేక్

రైతులు ఆందోళన చెందవద్దు.. పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో సీసీఐ పత్తి కొనుగోళ్ళు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోళ్ళు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు రైతులు. 

రైతుల విజ్ఞప్తిపై వెంటనే ఎమ్మెల్యే వివేక్  స్పందించారు.  చెన్నూర్ లో ప్రతి క్వింటా పత్తిని కొనేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడిన వివేక్.. వెంటనే పత్తి కొనుగోళ్ళు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.