హైద్రాబాద్ రవీంద్ర భారతిలో దళిత ఉద్యమకారుడు, అంబేద్కర్ వాది డాక్టర్ జేబీ రాజు 85వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జెబి రాజు ఉంటాడని కొనియాడారు.
తమ తండ్రి వెంకటస్వామికి జెబి రాజుతో మంచి సంబంధాలు ఉన్నాయని, కారంచేడు ఘటన జరిగినపుడు తమ తండ్రి, జెబి రాజు భయపడకుండా ప్రజల పక్షాన, దళితుల పక్షాన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేశారని అన్నారు. మంచి విలువలు ఉన్న నాయకులు జెబి రాజు అని, అయన నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు. ఇదే రవీంద్ర భారతిలో దళితుల కోసం 14 గంటల మాట్లాడారని కొనియాడారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ALSO READ | DKZ scam : రూ. 700 కోట్ల స్కామ్.. అబిడ్స్లో సమావేశమైన బాధితులు