దళితులలో ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఐక్యంగా ఉన్నపుడే హక్కులు సాధించుకోవచ్చునని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పిక్టోరియల్ బయోగ్రఫీ అంబేద్కర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, అరుణోదయ విమలక్క, పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, బల్లెపు మహేష్, పల్లె నాగేశ్వర్ రావు, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కేవలం దళిత నాయకుల కోసమే పనిచేశారనే ప్రచారం చేశారని, కానీ బీద వర్గాల కోసం ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. అంబేద్కర్ ఆలోచన ప్రాక్టికల్ గా ఉంటుందని ఎవరికి ఏ సొల్యుషన్ ఇవ్వాలనే ఆలోచనతో రాజ్యాంగం రాశారని కొనియాడారు.
అంబేద్కర్ ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచించలేదని, అన్ని వర్గాలలో ఉన్న బీదల హక్కులు ఏ విధంగా కాపాడాలో ఆలోచించేవారని అన్నారు. దళితులను అందరినీ అందరినీ ఒకే గ్రూప్ లో ఆర్టికల్ 341లో చేర్చారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయని, అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టించేందుకు తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నానని తెలతిపారు. ఎవరైనా వచ్చి అంబేద్కర్ విగ్రహం కోసం డబ్బులు అడిగితే ఇవ్వమని తన తండ్రి వెంటస్వామి చెప్పారని, ఇప్పటి వరకు 125 విగ్రహాలు డొనేట్ చేశానని ఈ సందర్భంగా తెలిపారు.
దళితులను బలహీన పరిచే కుట్ర
ప్రస్తుతం దళితులను బలహీన పరిచే కుట్ర జరుగుతోందని, ఇప్పుడు మాట్లాడుతున్న వారందరూ దళితులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సొంత లాభాం కోసమే కొందరు కావాలని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 1న వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులో కుల వివక్ష గురుంచి జడ్జిమెంట్ లో రాశారని, రిజర్వేషన్స్ తొలగించాలని ఆ జడ్జిమెంట్ లో ఉందని అన్నారు. SC ఉపకులాలకు జడ్జిమెంట్ లో ఏముందో అవగాహన కల్పించాలని అన్నారు.
మాలలు తక్కువగా ఉన్నారనే అసత్య ప్రచారం
మాలలు యూనిటీగా ఉంటేనే అన్ని హక్కులు సాధించుకోవచ్చని వివేక్ అన్నారు. మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని, ఈ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని, అందుకోసం పది శాతం ఎక్కువ పనిచేయాలని, అదేవిధంగా అందరూ చదువుకోవాలని అలా అయితేనే విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు.
ఇక సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని, కానీ చిన్న చిన్న వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. కేవలం వివక్షతో ఏసీబీ కింది కులాల వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.