
కోల్ బెల్ట్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల హైటెక్‌సీటీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం బహిరంగ సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాలలంతా సంఘటితంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మాల సంఘం లీడర్లు మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న డాక్టర్అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 10 వేల మందితో ఇంద్రవెల్లిలోని బుద్ధనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సభకు చెన్నూరు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్చీఫ్గెస్టులుగా హాజరవుతారని తెలిపారు. సభలో కవ్వాలీ, భజన కార్యక్రమాలుంటాయన్నారు. మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా నేతలు కొప్పుల రమేశ్, మేకల మల్లన్న, బేర దేవన్న, పాశం రాఘవేంద్ర, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తొగరి సుధాకర్, రాష్ట్ర నేత కె.రవికుమార్, ఇంద్రవెల్లి జయంతి నిర్వహణ అధ్యక్షుడు మనోహర్ కామ్లే, ప్రధాన కార్యదర్శి కామరాజ్ వాగ్మారే తదితరులు పాల్గొన్నారు.