వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి శనివారం రాత్రి మంచిర్యాల జిల్లాలోని పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్​మండల ప్రెసిడెంట్​ నీలయ్య–లత దంపతుల కొడుకు కిరణ్–హారిక పెండ్లి రెండ్రోజుల క్రితం జరగగా శనివారం ఆ జంటను ఆశీర్వదించారు.

 అదే గ్రామానికి చెందిన చెందిన భూక్య భూమ–సుమలత దంపతుల కూతురు ప్రణీత–శ్రీధర్ హల్ది ఫంక్షన్​కు హాజరయ్యారు. లక్షెట్టిపేట మండలం రామారావు పేటకు చెందిన డీసీఎంఎస్ ఎక్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తమ్ముడి కొడుకు నవీన్ రెడ్డి వివాహం ఆదివారం జరగనుండగా ఎమ్మెల్యే ఆయనను ఆశీర్వదించారు.