పెద్దపల్లిలో చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పర్యటన

పెద్దపల్లిలో చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పర్యటన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గంలో చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత డా. వివేక్‌‌‌‌‌‌‌‌వెంకటస్వామి పర్యటించారు. గురువారం నియోజకవర్గంలో జరిగిన పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో అఖిల్ శర్మ, బింధుశ్రీ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో జరిగిన పల్లె ప్రశాంత్, ఆద్య(సౌజన్య) వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను బోకేలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ మెంబర్​సయ్యద్​సజ్జాద్, కాంగ్రెస్ లీడర్లు బండారి సునీల్​గౌడ్, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, గంగుల సంతోష్​, కొయ్యడ సతీశ్​ పాల్గొన్నారు .

జ్యోతినగర్, వెలుగు: కాకా కుటుంబ అనుచరుడు భీమోజుల నాగలక్ష్మి–తిరుపతిచారి దంపతుల కూతురు విద్యశ్రీ వివాహం గురువారం ఎన్టీపీసీలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. ఈ వివాహనికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామిని సన్మానించారు. కాంగ్రెస్ లీడర్లు నాయకులు జావిద్, శ్రావణ్, వినోద్, మధు, సంజీవ్, బాపు, తదితరులు ఉన్నారు.

 ఎమ్మార్పీఎస్ నాయకుడికి వివేక్ వెంకటస్వామి పరామర్శ 

కరీంనగర్ సిటీ, వెలుగు : గుండె జబ్బుతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న ఇందారం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు రేగుంట సునీల్‌‌‌‌‌‌‌‌ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. రేనీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగారు స్వామిని సునీల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.