మాలలందరూ పోరాటానికి సిద్ధం కావాలి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

మాలలందరూ పోరాటానికి సిద్ధం కావాలి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

గజ్వేల్, వెలుగు : న్యాయం జరిగేవరకు మాలలందరూ పోరాటానికి సిద్ధం కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నుంచి చెన్నూరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎమ్మెల్యేను గజ్వేల్ పట్టణానికి చెందిన మాలమహానాడు నాయకులు కలిశారు.

రిమ్మనగూడ వద్ద ఓ ప్రైవేట్ హోటల్​లో వారితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు బండారు దేవేందర్, శివకుమార్, చిప్పల యాదగిరి, సురేశ్, కొడకండ్ల అశోక్, నర్సింలు, అరుణ్, ప్రవీణ్​తదితరులు పాల్గొనారు.