ఎమ్మెల్సీ విజయశాంతికి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందనలు

ఎమ్మెల్సీ విజయశాంతికి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందనలు

హైదరాబాద్: ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయశాంతి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్ ఫైల్​చేశారు. అయితే, ఇండిపెండెంట్ల నామిషన్లు నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. అందులో విజయశాంతి ఒకరు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపు కోసం చురుకుగా పనిచేసిన విజయశాంతి ట్వీట్లతో ప్రతిపక్షాలకు చురకలంటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండా నేరుగా ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గేనే చొరవ తీసుకొని విజయశాంతి పేరును ఖరారు చేశారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విజయశాంతి పోరాటం చేశారు. ఆ తర్వాత తన పార్టీని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్లో విలీనం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి.. తెలంగాణ కోసం తన గొంతును వినిపించారు. 

2014లో ఫిబ్రవరిలో కాంగ్రెస్లో చేరారు. 2020 డిసెంబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. అనంతరం 2023 నవంబర్లో బీజేపీకి గుడ్ బై చెప్పి మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో ఖర్గే నుంచి విజయశాంతికి స్పష్టమైన హామీ ఉన్నట్లు ప్రచారంలో జరిగింది. దీంతో విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో ఖర్గేనే కీలకంగా వ్యవహరించారని పీసీసీ వర్గాలు చెప్పుకొచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్​పర్సన్గా విజయశాంతి పనిచేశారు.