బైక్ రైడర్ హారికకు ఎమ్మెల్యే వివేక్ అభినందన

హైదరాబాద్, వెలుగు: బైక్​పై ఎవరెస్ట్​ శిఖరాని కంటే ఎత్తైన రోడ్డు మార్గం ఉమ్లింగ్ లా పాస్ ను చేరుకుని తిరిగొచ్చిన హైదరాబాద్​ మహిళా రైడర్​ హారిక మండలపును చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. 

సోమవారం బంజారాహిల్స్​లో ఎమ్మెల్యే వివేక్ ను హారిక కలిశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్(19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు. సొంత బైక్ లేనప్పటికీ లేహ్ ప్రాంతంలో బైక్ రెంట్ కు తీసుకుని, ఉమ్లింగ్ లా పాస్ కు చేరుకున్నట్లు హారిక తెలిపారు.