గద్దర్ పద్మశ్రీకి అన్ని విధాల అర్హుడు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  గద్దర్ పద్మశ్రీకి అన్ని విధాల అర్హుడు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పద్మ శ్రీ అవార్డుకు గద్దర్ అన్ని విధాల అర్హులని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.  రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి  ఉత్సవాల సభకు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..    కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి గద్దర్ కి  పద్మశ్రీ అవార్డు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.  

తెలంగాణ ఉద్యమం కోసం  గద్దర్ విశేష కృషి చేశారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.  ఎన్ని ఇబ్బందులు వచ్చినా గద్దర్ లో జోష్ తగ్గలేదన్నారు ఎమ్మెల్యే వివేక్.   కాక వెంకటస్వామి.. గద్దర్  ఆలోచనలు ఒకేలాగా ఉండేవన్నారు.  ఇద్దరు  కుల మతాబేధాలు లేకుండా  వ్యవహరించేవారని చెప్పారు.   ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పరితపించేవారని తెలిపారు. గద్దర్  కుటుంబంలో కంటే ప్రజల్లో ఎక్కువగా ఉండేవారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.