సింగరేణిలో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ​పే ఇవ్వండి : వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ​పే ఇవ్వండి : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు పర్ఫార్మెన్స్‌‌ రిలేటెడ్ పే ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి కోరారు. కార్మికుల పనితీరు ఆధారంగా ఇచ్చే పేమెంట్‌‌ను 2023 నుంచి ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ఫైల్ ప్రస్తుతం సీఎం దగ్గర ఉందని, వెంటనే క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

గురువారం అసెంబ్లీ జీరో అవర్‌‌‌‌లో వివేక్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాలంటరీ రిటైర్‌‌‌‌మెంట్‌‌ తీసుకున్న వాళ్లను కూడా ఆదుకుంటామని, నేమ్ ఛేంజ్ గురించి కూడా నిర్ణయం తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, అమలు చేయలేదన్నారు. వెంటనే ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ అంశాన్ని నోట్ చేసుకున్నామని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.