కోల్‌బెల్ట్, వెలుగు : చెన్నూర్ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సోమవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూర్ మండలం ఎర్రగుంట గ్రామంలో పల్లివాడలో, సుద్దాల నుంచి తుర్కపల్లి మార్గంలో రూ.20 లక్షల డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో చేపట్టనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
చెన్నూర్ అస్నాద్ రోడ్డులోనీ శక్తి డెయిరీ, మంగలిబజార్లోని ఉమామహేశ్వర మెడికల్ షాప్‌ను ప్రారంభించారు. చెన్నూర్ మండలం దుగ్నేపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చెలిమల బాపిరెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
కాలభైరవ జయంతి వేడుకలకు హాజరు
కోటపల్లి మండలం పారిపెల్లిలోని కాల భైరవ ఆలయంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పలు కార్యక్రమాల్లో నేతకాని సంఘం అధ్యక్షుడు దుర్గం అశోక్, సమతా సైనిక్ దల్ రాష్ట్ర నాయకులు సిద్ధార్థ రామ్మూర్తి
జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుదారి రాంబాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు మామిడిపల్లి బానయ్య, ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆసంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో..
రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో సోమవారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్, ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య , జిల్లా మైనార్టీ ఆఫీసర్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..
క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమకు నిదర్శనమన్నారు. కేక్ కట్ చేసి ప్రభుత్వం అందించిన కానుకలను క్రైస్తవులకు అందజేశారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్సాగర్రెడ్డి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.