గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఓల్డ్ బస్టాండ్, విద్య నగర్, దీపక్ నగర్ ఏరియాల్లో మార్నింగ్ వాక్  చేశారు  ఎమ్మెల్యే వివేక్. రోడ్డు,డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను ఎమ్మెల్యే గా గెలిచిన  తర్వాత మార్నింగ్ వాక్ లో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ లు, తాగు నీరు, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు.  రు. 79లక్షలతో రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాలు జరగడంతో ప్రజల పదేండ్ల కల ఫలించిందన్నారు. 

శ్రీపతి నగర్, దీపక్ నగర్ లో  మందమర్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు జాప్యం చేయకుండా నాణ్యతతో చేపట్టాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సింగరేణి కార్మిక వాడల్లో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఇప్పటికైనా శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందన్నారు.