మందమర్రిలో చెన్నూర్ ఎమ్మెల్యే రెండో క్యాంపు ఆఫీస్ ప్రారంభం

మందమర్రిలో చెన్నూర్ ఎమ్మెల్యే రెండో క్యాంపు ఆఫీస్ ప్రారంభం

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: చెన్నూర్ ​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రెండో ఆఫీస్‌ను ఆదివారం మందమర్రిలో ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాంప్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం రామకృష్ణాపూర్‌‌లో కాంగ్రెస్ లీడర్, తవక్కల్ విద్యా సంస్థల అధినేత ఎంఏ అబ్దుల్ అజీజ్ గృహప్రవేశానికి హాజరై ఆ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించారు.

రామకృష్ణాపూర్‌‌లో కాంగ్రెస్ కార్యకర్త రాసూరి చందు ఇంట్లో జరిగిన వేడుకలకు, చెన్నూరులో కాంగ్రెస్​ లీడర్లు చెన్న శ్రీనివాస్, ​-మంగ దంపతుల కూతురు మౌనిషా,- శివతేజ, పోటు మహేశ్వర్ రెడ్డి–మాలతి దంపతుల కొడుకు అనిల్ రెడ్డి, -పావని, నాగపూర్ గ్రామంలో అన్నల తిరుపతి,- జ్యోతి దంపతుల కూతురు ధరణి–సాయికుమార్ వివాహ వేడుకలకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. కొమ్మెరలో కాంగ్రెస్ లీడర్ రాజాగౌడ్ తమ్ముడు కాళేశ్వరం సంపత్ గౌడ్ సంవత్సరికానికి హాజరై, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.