
మంచిర్యాల జిల్లా మందమర్రి లో జరిగిన బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరి,సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మట్లాడుతూ ముస్లిం సోదరులకు బక్రీద్ ఎంతో విశిష్టమైనదని చెప్పారు. ఖురాన్ లో చెప్పిన విధంగా పేద ప్రజలకు సహాయం అందించేందుకు ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. నిరుపేద ప్రజలకు మన సంపాదనలో ఒక శాతం కేటాయించి ఆదుకోవాలని ఖురాన్ లో ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్.