ఈద్గా, దర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. రంజాన్ వేడుకల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఈద్గా, దర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. రంజాన్ వేడుకల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సోమవారం(మార్చి 31) చెన్నూరు నియోజకవర్గంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రత్యేక నిధులతో ఈద్గా, దర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. 

మంచిర్యాల జిల్లా చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రి ఈద్గాలలో రంజాన్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటామని తెలిపారు.