క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు :ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు :ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  •    దామళ్ల సర్వయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకం 
  •     దామళ్ల వెంకమ్మకు నివాళ్లులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  •     వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి పలు కుటుంబాలకు పరామర్శ

కారేపల్లి, వెలుగు : క్రమశక్షణతో ఏదైనా సాధించవచ్చని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి శనివారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని పేరుపల్లి గ్రామంలో దామళ్ల సర్వయ్య తల్లి వెంకమ్మ దశదినకర్మకు హాజరయ్యారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి మాట్లాడుతూ చిన్నపల్లె నుంచి ఎంతో క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదిగిన దామళ్ల సర్వయ్యను నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కొందరికే  దక్కుతుందని, అది తనకు కూడా దక్కిందని తెలిపారు. హైదరాబాద్​లో మాలల సింహగర్జన సక్సెస్​కు కూడా సర్వయ్య ఎంతో కృషి చేశారన్నారు. 

అంబేద్కర్ విగ్రహానికి నివాళి.. 

కారేపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి మండల మాల మహానాడు సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అక్కడే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలను మండల మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించారు. అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేలు ఖమ్మం నగరంలోని బీకే బజార్ లో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ గోపీనాథ్ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు  చెన్నయ్య, సంఘం నాయకులతో ముచ్చటించారు. ఎమ్మెల్యేల వెంట తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల స్టేట్ కో కన్వీనర్ పల్లా రాజశేఖర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి జంగం లక్ష్మణరావు, తెలంగాణ మాల జర్నలిస్ట్ స్టేట్ కన్వీనర్ పప్పుల వేణు, జిల్లా మాల జర్నలిస్టు సహాయ కార్యదర్శి కందుల ప్రసాద్,  కారేపల్లి మండల మాల మహానాడు నాయకులు తలారి చంద్ర ప్రకాశ్, మేదరి టోనీ, మైపాపీరయ్య, సోమందుల నాగరాజు ఉన్నారు. 

మంగాయమ్మకు నివాళి 

భద్రాద్రికొత్తగూడెం : హైదరాబాద్​లో ఏసీపీగా పనిచేస్తున్న సబ్బతి విష్ణుమూర్తి తల్లి మంగాయమ్మ(74) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్​లో మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని శనివారం జూలూరుపాడు మండలంలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, నాగరాజు ఆమె ఇంటి వద్దకు వచ్చి నివాళులర్పించారు. విష్ణుమూర్తిని ఓదార్చారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు మాలమహానాడు, పలు సంఘాలకు చెందిన నాయకులు డాక్టర్​ గోపీనాథ్, ప్రొఫెసర్ ​కాంబ్లీ, మద్దెల శివకుమార్, పరంజ్యోతి, శ్రీకాంత్​, మంచాల స్వామి, కె. కమలారాణి, రాజశేఖర్, జోగారావు, నవతన్ కూడా నివాళులర్పించారు.