
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదివారం (మార్చి 23) చెన్నూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా పొక్కూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద చెన్నూర్ నియోజకవర్గం పొక్కూరు గ్రామాన్ని ఎంపిక చేసిందని అన్నారు. 261 మంది లబ్ది దారులకు ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఇంటికి రూ.500 లకే గ్యాస్, 200 యూనిట్ ల ఉచిత కరెంటు ను అందిస్తున్నామని తెలిపారు.
ALSO READ | చెన్నూరులో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు పరిశీలించిన ఎమ్మెల్యే వివేక్..
కరోనా సమయంలో చాలా మంది ఆస్తులు అమ్ముకొని చికిత్స చేసుకున్నారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ నిదులు పెంచలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందిస్తోందని, సీఎం రిలీఫ్ ఫండ్ కిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు పెంచడం జరిగిందని గుర్తు చేశారు.
‘‘నేను ఇప్పటి వరకు రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు నిధులు ఇచ్చాము. ఈసారి విద్యా, వైద్యం పైన దృష్టి సారించి అభివృద్ధి చేస్తాము. కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తానని చెప్పి.. వాళ్ళ కొడుకు కేటీఆర్ కు100 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టించాడు’’ అని అన్నారు. అర్హులు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లబ్ది పొందాలని, నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా ను అరికట్టడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే వివేక్.