కాంగ్రెస్​ బలోపేతానికి కృషి చేశారు: వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​ బలోపేతానికి కృషి చేశారు: వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​లో తమ నాన్న  (కాకా) , ప్రేమ్ లాల్ కలిసి పనిచేశారని చెన్నూరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఇద్దరూ ఎంతగానో కష్టపడ్డారని చెప్పారు. 

ప్రేమ్ లాల్ లాంటి గొప్ప నేత మరణం కాంగ్రెస్  పార్టీకి పెద్దలోటు అని అన్నారు. ప్రేమ్ లాల్ ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు మంచి పదవి వస్తుందని భావించామని, ఇంతలోనే ఆయన మరణించడం దురదృష్టకరమని తెలిపారు. 

ప్రేమ్ లాల్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ కేశవ రావు, పార్టీ సీనియర్ నేతలు చిన్నారెడ్డి, కోదండరెడ్డి, ఎమ్మెల్యే శామ్యూల్, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్, పార్టీ నేతలు బొల్లు కిషన్, ఫిరోజ్ ఖాన్, దీపక్ జాన్ పాల్గొన్నారు.