త్వరలో చెన్నూర్లో 100 పడకల హాస్పిటల్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

త్వరలో చెన్నూర్లో 100 పడకల హాస్పిటల్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో త్వరలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మండలానికి చెందిన మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అర్హులైన 8700 మహిళలకు  గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్ ..ఈ సందర్భంగా మాట్లాడిన  ఆయన.. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రోడ్లు, డ్రైనేజ్ లను ఏర్పాటు చేయకపోవడంతో మున్సిపాలిటీలో వాడలు అస్తవ్య్తంగా మారాయన్నారు ఎమ్మెల్యే వివేక్. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్కటిగా రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. 

 మహిళల మేలు కోసమే కాంగ్రెస్ సర్కార్ పని చేస్తుందన్నారు వివేక్.  గత ప్రభుత్వం ఒక లక్ష రూపాయలను 5 దఫాలుగా రుణమాఫీ చేసిందన్నారు.  కాంగ్రెస్ సర్కార్ 2 లక్షలను ఒకేసారి రుణమాఫీ చేసిందన్నారు.  ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని చెప్పారు వివేక్.  అర్హులైన పేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామన్నారు.

60 వేలకోట్ల అప్పులను పదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్లకు పెంచిందన్నారు ఎమ్మెల్యే వివేక్. మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 300 కోట్లు కడుతుందని చెప్పారు. త్వరలోనే అందరికీ మహాలక్ష్మి పథకం అందుతుందన్నారు.  చెన్నూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ ఇవ్వాలని సీఎంను కోరామన్నారు.  విశాఖ చారిటబుల్ ట్రస్టు ద్వారా నియోజకవర్గంలో చాల బోర్లు వేశామన్నారు.  చెన్నూర్ లో రోడ్ల కోసం రూ.10 కోట్ల తీసుకొచ్చామన్నారు వివేక్.