కేంద్రమంత్రి అయ్యే చాన్స్ వచ్చినా.. కాంగ్రెస్లో చేరిన: ఎమ్మెల్యే వివేక్

కేంద్రమంత్రి అయ్యే చాన్స్  వచ్చినా.. కాంగ్రెస్లో చేరిన: ఎమ్మెల్యే వివేక్

కొందరు నేతలు  పరోక్షంగా తనపై చేసిన వ్యాఖ్యలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మారడం కాదు ప్రజలకు ఎంత వరకు మంచి చేశాం అనేది ముఖ్యమన్నారు.  కాక కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని గుర్తించిన  సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పారు. బీజేపీలో కేంద్రమంత్రి అయ్యే చాన్స్ ఉన్నా..కాంగ్రెస్ లో చేరానని  చెప్పారు వివేక్. 

జైపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్..  పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటాం.  దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలని అహంకారంతో  బాల్క సుమన్ సవాల్ చేశాడు. సవాళ్లను స్వీకరించి 22 రోజులలోనే ప్రచారం చేసి సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపాను.  గడ్డం ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తేనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.  స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.  బీజేపీలో  యూనియన్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్న కూడా నేను కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యాను. 

Also Read :- ఎప్పటికైనా బీజేపీ, RSS అంబేద్కర్‎కు శత్రువులే 

2019 లో నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్.. చివరి నిమిషం వరకు నమ్మించి గొంతు కోశాడు.  కేసీఆర్ ను ఓడించడమే టార్గెట్ గా చేసుకుని గత ఎన్నికల్లో కొట్లాడి ఓడించి కాక కుటుంబం అంటే ఏంటో చూపెట్టిన. న్యాయం కోసం పని చేస్తా... చట్ట పరిధిలోనీ పనులకే నా మద్దతు, నా అండా ఉంటది.   కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్  రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు .  అలాంటి రాజకీయాలు అంటే నాకు అసహ్యం . నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.  నేను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక,బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశాను .  చెన్నూరు నియోజవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది.  ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుంది అని వివేక్ అన్నారు.