కేసీఆర్ పక్కన పెడితే.. ఈటలకు నేను మద్దతిచ్చా: వివేక్ వెంకటస్వామి

 కేసీఆర్ పక్కన పెడితే హుజురాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ కు తాను మద్దతిచ్చానని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి.  వెంకటాపురం గ్రామానికి చెందిన  దాదాపు 100 మంది ముదిరాజ్  నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.   ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. ముదిరాజ్ బిడ్డ ఈటల రాజేందర్ ను కేసీఆర్ పార్టీ నుంచి పక్కన పెట్టాడు.. ఆయన వెనుక ఉండి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతిచ్చానని చెప్పారు.  బీసీ డీ నుంచి ఎ కు రిజర్వేషన్ కల్పించేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. దివంగత నేత రత్నాకర్ రావు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. అందరికీ న్యాయం చేసేలా రత్నాకర్ రావు ఆశయాలను కుమారులు నర్సింగ్ రావు, కృష్ణరావులు కొనసాగిస్తున్నారని తెలిపారు. 

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొప్ప నేత అని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో  కొట్లాడారని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కోరుట్ల నియోజకవర్గంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమి లేదని విమర్శించారు.  ఉగాది తర్వాత వచ్చే బడ్జెట్ లో కొత్త పెన్షన్ లు మంజూరు చేస్తామన్నారు. సోనియమ్మ రాజ్యంలో రూ.400లకే సిలిండర్ ఇచ్చామన్నారు. మోడీ సర్కార్  చెబుతున్నా అచ్చే దిన్ ఎక్కడా అని ప్రశ్నించారు.  గంగ పుత్రులు బీసీఏ, ముదిరాజులు బీసీ బీలో కేటాయించబడ్డారు.  ముదిరాజులు బీసీఏలో చేర్చితే మరింత లబ్ధిపొందుతారని చెప్పారు.కుల గణన చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.  దళిత బలహీన వర్గాలకు కాకా వెంకటస్వామి చేసిన పోరాటం మరవలేనదని చెప్పారు.