పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పైసా పని కాలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. మందమర్రి ఓల్డ్బస్టాండ్, విద్యానగర్, దీపక్ నగర్ ఏరియాల్లో ఎమ్మెల్యే మార్నింక్ వాక్ చేశాడు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చెన్నూరు దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటు లో ఉండి, సేవ చేస్తామన్నారు. మందమర్రి మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ ఆధాన్వంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
బుధవారం (డిసెంబర్రూ 4) మందమర్రిలో రూ. 79 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ప్రజల పదేండ్ల కల ఇవాళ్టితో ఫలించిందన్నారు. కాంట్రాక్టర్లు జాప్యం చేయకుండా అభివృద్ధి పనులను క్వాలిటీతో చేపట్టాలని సూచించారు. సింగరేణి కార్మిక వాడల్లో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికైనా శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
రూ. 30 కోట్లతో రామగుండంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 11 ఏండ్లు దాటిన క్యాతన పల్లిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయలేదన్నారు. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద గంటలు తరబడి స్థానికులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోయాయన్నారు.
ALSO READ : పెద్దపల్లికి మరిన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు తీసుకొస్తాం: ఎంపీ వంశీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం క్యాతన పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని పనులు పూర్త ి చేసి సంక్రాంతి పండుగలో అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు వివేక్ వెంకటస్వామి.
అదే విధంగా కాగజ్నగర్- తిరుపతి మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ విన్నవించామన్నారు. త్వరలో కొత్త రైలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో వీలైనన్ని ఎక్కువ రైళ్లకు హల్టింగ్ కల్పించేందుకు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నారని’ అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.