డిసెంబర్ 1న మాలల సత్తా చూపించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

డిసెంబర్ 1న మాలల సత్తా చూపించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

డిసెంబర్ 1న  మాలల సత్తా చూపించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.   హైదరాబాద్ లోని తుకారం గేట్ దగ్గర నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ మాట్లాడారు. ఈ సందర్బంగా  మాలలంతా ఏకమవ్వాలన్నారు.   రాజకీయ పార్టీలు మాలలను కించపరుస్తున్నాయని..ఏ ఒక్క రాజకీయ నాయకుడు  మాలల గురించి మాట్లాడటం లేదన్నారు.  తెలంగాణలో మాలలు 30 లక్షల మంది ఉన్నారు.. డిసెంబర్ 1న జరగబోయే సింహ గర్జనకు మాలలంతా కలిసి రావాలి.. మన పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమించాలి.  పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే మాలల సింహ గర్జన సభను చూసి రాజకీయ పార్టీలకు భయం పుట్టాలన్నారు వివేక్.

 తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాలలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి.ఈ సమావేశానికి తాను రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన రాజు వస్తాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కాకా వెంకటస్వామితో మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు.

వర్గీకరణ అంశం సరైన నిర్ణయం కాదని మాల ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి దృష్టిని కలిసి చర్చించామని చెప్పారు. మాల జాతి కోసం కాకా చాలా పోరాడారని గుర్తుచేశారు. మాల జాతికి గౌరవం దక్కే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మాలల సింహ గర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  మాలలంతా కలిసే ఉన్నారని చెప్పడానికే  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో  సభ నిర్వహిస్తున్నామని చెప్పారు వివేక్.