ప్రజల ఆకాంక్ష మేరకే.. ఎమ్మెల్యేగా పోటీ చేశా

ప్రజల ఆకాంక్ష మేరకే.. ఎమ్మెల్యేగా పోటీ చేశా
  • చేన్నూరు ప్రజలకు కృతజ్ఞతలు
  • సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
  • సింగరేణి ఎన్నికల్లో ఐన్టీయూసీని గెలిపించండి
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వా్మి

తన గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యక్తలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు ప్రజల ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే గా పోటీ చేశానని తెలిపారు.  ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని.. వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ మందమర్రిలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్.. అక్కడి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.  అదేవిధంగా మార్కెట్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పంచారు.  అనంతరం ఐఎన్యూసీ, కాంగ్రెస్ కార్యక్తలతో వివేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. 

అనంతరం వివేక్ మాట్లాడుతూ..‘ ప్రగతి భవన్  ముుందు ఇనుప కంచె తొలగించడంతో ప్రజలు సంతోషపడ్డారు. సింగరేణిలో లోకల్ కాంట్రాక్టు కార్మికులు, లోకల్ కాంట్రాక్టర్లు ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయ  చేస్తా. స్థానికులకు ఉద్యోగ అవకాశాల జీ.ఓ గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది. ఆ జీ.ఓను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా.  బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 27 వేల కోట్ల రూపాయల బాకీ చేసి నష్టాల్లోకి తీసుకెళ్లింది. సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు చేసేలా యాజమాన్యం కి ప్రభుత్ నుుంచి ఉత్తర్వులు ఇప్పిస్తాం. సింగరేణి ఎన్నికల్లో ఐన్యూసీని గెలిపించాలి. జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుుంది’ అని వివేక్ అన్నారు.