- చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ధర్మారం, వెలుగు : ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీనియర్ నాయకులు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మారంలో ఉపాధి కూలీలతో మాట్లాడారు.
కాంగ్రెస్ పేదల పక్షపాతి అని, ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఉపాధి కూలీలను అభ్యర్థించారు. అడ్లూరి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని, అలాగే గడ్డం వంశీని ఎంపీగా గెలిపిస్తే అన్నదమ్ముల్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
గుజ్జుల రామకృష్ణరెడ్డి కుటుంబానికి పరామర్శ
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సోదరుడు రాజ నరేందర్ రెడ్డి అనారోగ్యం కారణంతో సోమవారం చనిపోయారు. మంగళవారం విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ధర్మారం మండలం కమ్మారిఖాన్ పేటలోని రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లి నరేందర్‌రెడ్డి డెడ్‌బాడీ వద్ద నివాళులర్పించారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, లీడర్లు కోడారి అంజయ్య, కాడే సూర్యనారాయణ, రాజేశం గౌడ్, దేవి జనార్ధన్, నరసింహులు, రూప్లానాయక్, రాజేశం, చిరంజీవి, తిరుపతి పాల్గొన్నారు.