
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం పర్యటించారు. జిల్లాకేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బూషనవేన రమేశ్‌గౌడ్ కూతురు వివాహం ఇటీవల జరిగింది. వివేక్ వెంకటస్వామి.. రమేశ్‌గౌడ్ ఇంటికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య ఇంట్లో లంచ్ చేశారు.
ప్రస్తుత రాజకీయలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత మంథని పట్టణానికి చెందిన ఆరెంద మాజీ సర్పంచ్ , మాల మహానాడు రాష్ట్ర నాయకులు నూకల బాణయ్య ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందారు. ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ భవనంలో కాకా వెంకటస్వామి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
స్థానిక రిపోర్టర్ దాసరి రాజేశం కొడుకు పెండ్లి ఇటీవల జరగగా కొత్త దంపతులను ఆశీర్వదించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వివేక్ వెంట లీడర్లు బండారి రామమూర్తి, జిల్లా దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జాద్, బండారి సునీల్‌గౌడ్, బాలసాని సతీశ్‌గౌడ్, అడ్డగుంట శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో చెన్నూరు అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సృజన్ కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. సృజన్ చిన్నమ్మ రాజేశ్వరి ఇటీవల గుండె పోటుతో చనిపోగా.. గోదావరిఖనిలోని వినోభానగర్‌లో వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి వివేక్ వెంకటస్వామి సానుభూతిని తెలిపారు.