పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో పలు బాధిత కుటుంబాలను కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. పెద్ద బొంకూర్కు చెందిన కలవేన సమ్మయ్య ఇటీవల చనిపోగా.. వారింటికి వెళ్లి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలవేన సమ్మయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన వెంట లీడర్లు సయ్యద్ సజ్జాద్, బండారి సునీల్ పాల్గొన్నారు.
కాడే సూర్యనారాయణను...
ధర్మారం, వెలుగు : వారం కింద సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. చికిత్స తీసుకొని ఆయన ఇటీవల ఇంటికి రాగా.. వివేక్ వారింటికి వెళ్లి సూర్యనారాయణ ఆరోగ్య సమాచారం తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.