
కోల్బెల్ట్, వెలుగు: హైదరాబాద్లోని బ్రిన్నోవా ట్రాన్సీషనల్ కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. ఓదేలు ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.
ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా ఓదేలు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతూ మొదట యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.