వర్గీకరణతో అపోహలు తొలగాలి..మాలలకు 48 వేల జాబ్స్ వస్తే.. మాదిగలకు 65 వేలు : ఎమ్మెల్యే వివేక్

వర్గీకరణతో అపోహలు తొలగాలి..మాలలకు 48 వేల జాబ్స్ వస్తే.. మాదిగలకు 65 వేలు : ఎమ్మెల్యే వివేక్

ఎస్సీ వర్గీకరణతో మాలలు, మాదిగలకు మధ్య ఉన్న అపోహలు తొలగిపోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా  మాట్లాడిన వివేక్..  వర్గీకరణ టైంలో మాలలపై తప్పుడు ప్రచారం చేశారన్నారు . ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై ఫేక్ ప్రచారం చేశారని విమర్శించారు. ఉద్యోగాలు, స్కీంలు మాలలకే వచ్చినట్లు ఫేక్ ప్రచారం చేశారని తెలిపారు. మాదిగలకు 65 వేలకు పైగా జాబ్ లు వస్తే..మాలలకు 48 వేల జాబ్స్ వచ్చాయన్నారు వివేక్. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో మాదిగలకే ఎక్కువ వాటా ఇచ్చారన్నారు వివేక్.

 బడ్జెట్ లో ఎస్సీలకు 18 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వివేక్.  ఇందిరాగాంధీ ఎస్సీలకు ఎంతో చేశారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ .. అసైన్డ్ భూములను ఎస్సీలకు పంపిణీ  చేశారని తెలిపారు. వర్గీకరణపై  కమిటీ రిపోర్ట్ ఇస్తే స్టడీ చేసి సలహాలు ఇస్తామన్నారు వివేక్.   కులగణన ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు.  

ఎస్సీల్లో విభజన తెచ్చే ప్రమాదం ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పారన్నారు ఎమ్మెల్యే వివేక్.  హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు పెరిగాయన్నారు. ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కాంట్రాక్టుల  కేటాయింపుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  నామినేటెడ్ పోస్టుల్లోనూ 18 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వివేక్.