సిద్దిపేటలో మృతురాలి కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

సిద్దిపేటలో మృతురాలి కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట టౌన్ భారత్ నగర్ కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి భార్య శ్వేత ఇటీవల అనారోగ్యంతో మరణించగా, బాధిక కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం పరామర్శించారు. చిన్న వయస్సులోనే ఆమె మరణం బాధకలిగించిందన్నారు. మృతురాలు శ్వేత తల్లిదండ్రులు చెన్నూరు ప్రాంతానికి చెందిన వారు. ఆమె అన్న, తండ్రి సింగరేణిలో పని చేస్తున్నారు. వారితో ఉన్న పరిచయాలతో ఎమ్మెల్యే వివేక్ సిద్దిపేటకు వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసానిచ్చారు.