ఎస్సీలకు బడ్జెట్ లో 18 శాతం కేటాయించండి.. సీఎంకు ఎమ్మెల్యే వివేక్ లేఖ

ఎస్సీలకు బడ్జెట్ లో  18 శాతం కేటాయించండి.. సీఎంకు ఎమ్మెల్యే వివేక్ లేఖ

 

  • చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయండి
  •  రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరడం హర్షణీయం
  • సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ
  • ఈ లెక్కన ఎస్సీల వాటా రూ. 54వేల కోట్లు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీకు 18% నిధులు కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీలకు 18 శాతం  రిజర్వేషన్లు కేటాయించడంతోపాటు బడ్జెట్ కూడా కేటాయిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల  కోట్లకు చేరుకోవడం శుభపరిణామమని అన్నారు. 

ALSO READ | అఖిల పక్షానికి కమలం, కారు దూరం.. హాట్ టాపిక్‎గా రెండు పార్టీల తీరు

ఇందులో 18 శాతం నిధులు అంటే 54 వేల కోట్లను ఎస్సీల అభ్యున్నతికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది దళితుల ఓట్లను పొందడానికి ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. గతంలో ఎస్సీల సంక్షేమానికి  8 వేల కోట్లు తక్కువగా కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో 54 వేల కోట్లు ఎస్సీలకు కేటాయించేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని వివేక్ కోరారు.