
ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు వివేక్.
కులగణన ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్ హామీని అమలు చేయాలని ఖర్గేను రిక్వెస్ట్ చేశారు .
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు బడ్జెట్ లో 15 శాతం తప్పనిసరి చేసింది. కులగణలో ఎస్సీల జనాభా 18 శాతానికి పెరిగింది. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు బడ్జెట్ లో 18 శాతం నిధులు కేటాయించాలి.. రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి అని ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు వివేక్..
రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో కూడా మాట్లాడారు. నిధులు లేక కొన్నేండ్లుగా ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్లకు సబ్సీడీ రావడం లేదన్నారు. అన్ని రకాల కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం కేటాయించాలని..కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలోనూ ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని వివేక్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వేషన్లపై ఇవాళ ఖర్గేకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.