చెన్నూరును క్లీన్ టౌన్‌గా మారుస్త

డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్త

అభివృద్ధికి అంతా కలిసి రండి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్‌బెల్ట్: చెన్నూరుసు రానున్న రోజుల్లో క్లీన్ టౌన్‌గా మారుస్తామని చెన్నూరు ఎమ్మె ల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ లో మున్సిపల్ అధికారులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపాలిటీలో పలు వార్డుల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. చిన్నారులతో ముచ్చటించారు. 

ALSO READ | చెన్నూరు రూపురేఖలు మారుస్తా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వార్డుల్లో రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులకు అందుబాటులో ఉండి సేవ చేసి రుణం తీర్పు కుంటామన్నారు. భవిష్యత్తులో చెన్నూరును అభివృద్ధిలో సంబర్వస్ గా మారుస్తామన్నారు. ప్రజలందరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. పట్టణంలోని బట్టి గూడెం కాలనీలోని శ్రీ లక్ష్మీ దేవీ దేవాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసుల ఆయనను శాలువాతో సత్కరించారు.