తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నేతల వాహనాలను కూడా అపి తమ డ్యూటీ నిర్వర్తిసున్నారు. తాజాగా చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు.
మంచిర్యాల జిల్లా నస్ పూర్ మున్సిపాలిటీ సీసీ క్రాస్ రోడ్డులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటు వైపుగా వెళ్తు్న్న వివేక్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. ఆయన కారుతో పాటు కార్యకర్తలు, మీడియా వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.
ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు వివేక్ వెంకటస్వామి కూడా సహకరించారు. చెకింగ్ అనంతరం వివేక్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.
ALSO READ :- సీడీపీవో పోస్టుల ఎంపికను మూడు నెలల్లో కంప్లీట్ చేయాలి : TSPSECకి హైకోర్టు ఆదేశం