కోల్ బెల్ట్,వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లె రాజు-శ్రీదేవి దంపతుల కుమారుడు దీక్షిత్ -జాహ్నవిల పెళ్లి ఇటీవల జరిగింది. వధూవరులను చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు.
జర్నలిస్ట్ కాలనీలో పల్లె రాజు ఇంటికి వెళ్లి కలిశారు. మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లి లో జరిగిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ లీడర్ బొలిశెట్టి కనుకయ్య -సువర్ణ దంపతుల కుమార్తె అమూల్య- అనుదీప్ పెండ్లి వేడుకలకు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.