- పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : మందమర్రి, జైపూర్, భీమారం మండలాల్లో జరిగిన పలు వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన చిర్రకుంట మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య మేనకోడలు తేజశ్రీ-–అభినవ్ యాదవ్ పెండ్లి వేడుకల్లో పాల్గొని వధువరులు ఆశీర్వదించారు.
అమ్మ గార్డెన్స్‌లో జరిగిన బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.సూరిబాబు బంధువు సంహిత–-వినోద్వధూవరులు, బూరుగుపల్లిలో జరిగిన భీమారం జడ్పీటీసీ లక్ష్మణ్ అన్న కూతురు కల్యాణి–-దేవేందర్ వివాహ వేడుకలో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. జైపూర్ మండలంలో రామారావుపేటలో రజకుల ఆరాధ్య దైవమైన మడేలయ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు సైతం హాజరయ్యారు. ఆలయంలో పూజలు చేశారు.
ఫ్రీ కరెంటు వర్తింపుపై ఆరా..
కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీం లబ్ధిదారులందరికి వర్తించే విషయంపై ఎమ్మెల్యే వివేక్ ఆరా తీశారు. గురువారం రాత్రి భీమారం మండలం పోతనపల్లి, కాజీపెల్లి గ్రామాల్లో పర్యాటించిన ఆయన మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
భీమారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి లక్ష్మి, మండల కేంద్రంలో చనిపోయిన పుట్ట బుచ్చమ్మ కుటుంబాలను గురువారం రాత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీ ప్రతాప్, బండి సదానందం, ఓడ్నాల శ్రీనివాస్, గుడ్ల రమేశ్, ముక్తి శ్రీనివాస్, రాయబారపు కిరణ్, భీమారం జడ్పీటీసీ భూక్య తిరుమల, పలువురు లీడర్లు పాల్గొన్నారు.