పెద్దపల్లి ఎమ్మెల్యేతో వివేక్ వెంకటస్వామి భేటీ

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కాంగ్రెస్​సీనియర్​ నేత, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఆదివారం భేటీ అయ్యారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్‌‌ను ఎమ్మెల్యే విజయరమణారావు ఆహ్వానించి అల్పాహార విందు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీరిద్దరిని పలువురు లీడర్లు

కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. వివేక్ వెంకటస్వామి వెంట ఆయన కుమారుడు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుడు గడ్డం వంశీకృష్ణ, లీడర్లు సామ రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల సంతోష్ రావు, ఎండీ కలీం, దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, మల్లయ్య, కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.