చెన్నూరు, వెలుగు : చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సుద్దపల్లి సుశీల్ కుమార్కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం సాయంత్రం సుశీల్ కుమార్తల్లి వెంకటమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన చెన్నూరు చేరుకున్నారు.
వెంకటమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు గొడిసెల బాపిరెడ్డి, ఫయాజ్, సూర్యనారాయణ, గజ్జెల అంకాగౌడ్, చింతల శ్రీనివాస్, పాతర్ల నాగరాజ్, తనుగుల రవి, ముత్యాల బాపగౌడ్, లచ్చన్న, జడల సతీష్ తదితరులు ఉన్నారు.