బీఆర్‌ఎస్ పాలన తర్వాత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు : ఎమ్మెల్యే గడ్డం వివేక్

నల్లగొండ జిల్లా : నియంతృత్వ బీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. 78 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మిర్యాలగూడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి హాజరైయ్యారు.  విద్యార్థులు, యువతలో జాతీయ భావాలను పెంపొందించేలా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని గడ్డం వివేక్ అన్నారు. 

గత ప్రభుత్వం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం పని చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తుందని వివేక్ అన్నారు.  సుంకిశాల, మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టుల పాపం బిఆర్ఎస్ ప్రభుత్వానిదే. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్ పనులు కట్టబెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాల వీక్షించారు.