క్వాలిటీ లేకనే సుంకిశాల కూలింది: గడ్డం వివేక్ వెంకటస్వామి

క్వాలిటీ లేకనే సుంకిశాల కూలింది: గడ్డం వివేక్ వెంకటస్వామి
  • మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెబితే కేసీఆర్ వినలే
  • రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి కాంట్రాక్టర్లకు అప్పగించిండ్రు
  • చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి 

మిర్యాలగూడ: క్వాలిటీ లేకనే సుంకిశాల ప్రాజెక్ట్​రిటైనింగ్​వాల్ కూలిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెబితే కేసీఆర్ వినలేదని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ బాధపడుతున్నారని తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ ఎస్పీ క్యాంప్ లో ఏర్పాటుచేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ సుంకిశాల ప్రాజెక్టును గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి కాంట్రాక్టర్లకు అప్పగించిందన్నారు. అబద్ధాలు చెప్పి  ప్రజలను తప్పుదారికి మళ్లిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలులో  భాగంగా రూ. 2 లక్షల రుణమాఫీ అవుతున్న తరుణంలో.. ప్రభుత్వం వేలకోట్లు అప్పు చేసిందని కేటీఆర్ విమర్శిస్తున్నారని ఫైర్​అయ్యారు.