మాలల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. మల్కాజ్ గిరిలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ ఒకటవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల ఆత్మీయ సభను వంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
మాలలను చిన్నచూపు చూస్తున్నారు..30 లక్షల మంది ఉన్నాం.. మన సత్తా ఎంటో చూపాలన్నారు వివేక్ వెంకటస్వామి. ఇన్ని రోజులు ముసుగు వేసుకొని ఇంట్లో కూర్చున్నామని ఇప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. స్వచ్ఛందంగా మాలలందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వివేక్.