ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. విద్య,వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. భీమారం మండల కేంద్రంలో కోటి 43 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జైపూర్ మండలం వేలాలలో 20 లక్షల అంచనా వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..భీమారం లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణంను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన చెప్పారు.
Also Read :- దుర్గం చెరువుపై రెవెన్యూ ఫోకస్
చెన్నూరు నియోజకవర్గంలో రెండు పీహెచ్ సీలు, ఒక సబ్ సెంటర్ మంజూరయ్యాయని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. నిధులు కూడా డీహెచ్ ఎంఓకు వచ్చాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మరింత సులభం అవుతుందని తెలిపారు. పదేండ్లలో క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటిల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, తాగునీటీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మూడు మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి డ్రైన్స్, రోడ్లును నిర్మిస్తామన్నారు. మందమర్రి మున్సిపాలిటిలోని మందమర్రి లో రూ. కోటి 55 లక్షల డీఎంఎఫ్ టి ఫండ్స్ తో సైడ్ డ్రైన్స్ నిర్మిస్తామన్నారు వివేక్.