
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చెన్నూరు నియోజకవర్గంలో వంశీకి లక్ష మెజారిటీ తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో పాత కార్యకర్తలను ఎప్పుడు మర్చిపోను.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కాకా వెంకటస్వామిని విమర్శించే అర్హత గోమాస శ్రీనివాస్ కు లేదన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అయిందన్నారు వివేక్ వెంకటస్వామి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలను చిత్త శుద్ధితో అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ మహిళలకు 8500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. రైతులందరికీ రైతు బంధు అమలు చేస్తామని.. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపారు వివేక్ వెంకటస్వామి.