మిషన్ భగీరథతో రూ. 40 వేల కోట్లు వృథా చేశారు: ఎమ్మెల్యే వివేక్

మిషన్ భగీరథతో రూ. 40 వేల కోట్లు వృథా చేశారు: ఎమ్మెల్యే వివేక్


మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో   గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల ప్రజాదనాన్ని వృథా చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఇవాళ చెన్నూరు మున్సిపాలిటీలో 5వ వార్డులోని గెర్ర కాలనీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ పనులకు పెద్దపల్లి ఎంపీ వంశీకృ ష్టతోకలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరుగక ఆధ్వానంగా తయారైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రయారిటీగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుంది. చెన్నూర్ నియోజ కవర్గంలో మిషన్ భగీరథ స్కీమ్ ఆధ్వానంగా ఉంది. మురికి, వాసన వచ్చే నీళ్లు వస్తు న్నాయి. గత బీఆర్ఎస్ పాలనకు పేదలు ఇబ్బందులు పడుతున్నరు. ఎక్కడికి వెళ్లిన నీళ్లు రావడం లేదని కంప్లైట్లు వస్తున్నయి. ఇప్పుడు అలాంటి బాధ అవసరం లేదు. రూ.31 కోట్లతో అమృత్ పథకం కింద చెన్నూర్ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తం. చెన్నూర్ మూడు మున్సిపా లిటీలకు ఎంపీ చొరవతో అమృత్ స్కీమ్ మంజూరు చేశారు. 

చెన్నూరు నియోజ కవర్గానికి ఎంపీ ల్యాండ్ కింద ఎక్కువ నిధులను ఇవ్వాలని ఎంపీని కోరుతున్నం. సీఎం, మంత్రుల చొరవతో చెన్నూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తం. సుద్దాల విలేజ్ ను ఆదర్శ విలేజ్ గా మారుస్తమని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అంతకుముందు చెన్నూరు టూన్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు. స్థాని కుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి, సమస్యలను పరిష్కరించారు.