ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలి : ఎమ్మెల్యే వివేక్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలి : ఎమ్మెల్యే వివేక్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంలో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు  పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్..  నరేందర్ రెడ్డికి ఈ ప్రాంతంలో ఉన్న వారందరి సమస్యలు తెలుసు.  ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 44 విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారని చెప్పారు.  

చెన్నూరు నియోజకవర్గంలో 7500 మంది పట్టభద్రులు ఉన్నారు .  తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని మనం కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ గత పదేళ్లలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 54000 ఉద్యోగాలు వచ్చాయి.  నేను కూడా ఇక్కడ మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశాను.  జైపూర్ లో పవర్ ప్లాంట్ లో స్థానికులకే పని కల్పించేలా చర్యలు తీసుకున్నాను.   నేను అన్ని వార్డులు గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నాను. అన్ని చోట్ల మంచి నీరు కావాలని అన్నారు.  నేను చాలా చోట్ల బోర్ వెల్స్ వేయించాను.  చెన్నూర్ నియోజకవర్గంలో ఇప్పటి నుండి విద్యపై పూర్తిస్థాయిలో పని చేస్తాను.  ప్రజలకు మెరుగైన విద్య అందేలా కృషి చేస్తాను అని వివేక్ అన్నారు.

సీసీఐ కొనుగోళ్లు ప్రారంభంతో  రైతుల ఆనందం : ఎంపీ వంశీ

తెలంగాణ బిల్లు పాస్ అయి ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తయింది.  తెలంగాణా ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. 
తెలంగాణా ఉద్యమ కారుల కోసం వివేక్ కుటుంబం చాలా కృషి చేసింది.  తెలంగాణా రాష్ట్రం కాంగ్రెస్ తోనే సాధించేలా వివేక్ వెంకటస్వామి కృషి చేశారు. పార్లమెంట్ స్థాయిలో ఏం పని చేయాలన్నా సంబంధిత మంత్రులతో కలిసి ఇక్కడ చాలా పనులు చేయించాం. జోడు వాగులు దగ్గర రోడ్డు పనులు వెంటనే జరిగేలా కృషి చేస్తాం. సీసీఐ పత్తి కొనుగోళ్ళు ఆపేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ కొనుగోళ్ళు ప్రారంభం అయ్యేలా చూశాం.  పత్తి కొనుగోళ్ళు సజావుగా జరుగుతున్నాయి... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి అని వంశీ అన్నారు.