రూల్స్ ప్రకారమే ఫాంహౌస్ కట్టాం.. తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై కేసు వేస్తా: ఎమ్మెల్యే వివేక్

రూల్స్ ప్రకారమే ఫాంహౌస్ కట్టాం.. తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై కేసు వేస్తా: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్ లో రూల్స్ ప్రకారమే ఫాం హౌస్ కట్టామని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  నిబంధనలకు విరుద్ధంగా కట్టారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.  30 మీటర్ల దూరంలో రూల్స్ పాటించే ఫాంహౌస్ కట్టామని క్లారిటీ ఇచ్చారు  వివేక్. బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. చెన్నూరు MLA క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన వివేక్... చట్టానికి లోబడే పనులు జరిగాయన్నారు.

తెలంగాణా సాదించుకున్నాక నా మీద కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష్య కట్టింది.  కేసీఆర్  నా సంస్థలకు ప్రభుత్వ యాడ్స్ ఇవ్వకుండా   చేశారు. నేను ఎప్పుడూ చట్ట పరిధిలోనే పనులు చేస్తాను. నాకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు. నా మీద ఎన్నో కేసులు పెట్టడానికి చూసిన నేను భయపడలేదు. కేటీఆర్ ప్రభుత్వం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. కేటీఆర్ అసలు ఎప్పుడు ఎం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదు. నా పైన బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోను. మళ్ళీ నా మీద అసత్య ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం కేటీఆర్ పై  చర్యలు తీసుకుంటామని  ఎమ్మెల్యే వివేక్  హెచ్చరించారు