మంత్రి దామోదర్​తో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి భేటీ

హైదరాబాద్​: తలసేమియా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలని  ప్రభుత్వాన్ని చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కోరారు. ఈమేరకు  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహాను సచివాలయంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ సమస్యలపై మంత్రితో చర్చించారు. చెన్నూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో పిల్లలు  ఎక్కువగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి 15 రోజుల కొకసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. పేదలు ఈ వ్యాధికి అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితుల్లో ఉన్నందున తలసేమియాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర  ఆరోగ్యమంత్రికి తెలిపారు.