భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ప్రముఖ డాక్టర్ గోపినాథ్ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం జూలురుపాడు లో కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తర్వాత కారేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామంలో దామళ్ల వెంకమ్మ సంతాప సభలో పాల్గొన్నారు.
ALSO READ | మరీ ఇంత అన్యాయమా..? కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది..? కేంద్రం ఏం చేసింది..?